Breaking News

ఐసీసీ అవార్డు గెలుచుకున్న ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం

Published on Tue, 02/13/2024 - 17:00

బౌలింగ్‌ సంచలనం, విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు (2024 జనవరి) దక్కించుకున్నాడు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను షమార్‌ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ పోటీపడినప్పటికీ.. విండీస్‌ సంచలన బౌలర్‌నే అవార్డు వరించింది. వివిధ పద్దతుల్లో జరిగిన ఓటింగ్‌లో అత్యధిక శాతం‌ ఓట్లు  షమార్‌కే దక్కాయి.

మహిళల విషయానికొస్తే.. ఈ విభాగంలో జనవరి నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును అమీ హంట‌ర్(ఐర్లాండ్) దక్కించుకుంది. గత నెలలో అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అమీ హంటర్‌ ఈ అవార్డుకు ఎంపికైంది. అమీతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. 

కాగా, షమార్‌ జోసఫ్‌ గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ విండీస్‌ యువ పేసర్‌ తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

ఈ పర్యటనలో ఆసీస్‌ బ్యాటర్లను గడగడలాడించిన షమార్‌ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో షమార్‌ విశ్వరూపం​ (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్‌ 30 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ విజయాన్ని నమోదు చేసింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)