Breaking News

షకీబ్‌ 500 వికెట్ల క్లబ్‌లో...

Published on Tue, 08/26/2025 - 08:53

ఢాకా: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టి20 క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. వెస్టిండీస్‌లో జరుగుతోన్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో అంటిగ్వా–బార్బుడా ఫాల్కన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షకీబ్‌... సెయింట్‌ కిట్స్‌–నెవిస్‌ పేట్రియాట్స్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. టి20ల్లో షకీబ్‌కిది 500 వికెట్‌ కావడంతో అరుదైన ఈ క్లబ్‌లో చేరిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 

ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 3 వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 పైచిలుకు తీసిన బౌలర్లు ఇంతకుముందు నలుగురే ఉన్నారు. అఫ్గానిస్తాన్‌ వెటరన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 660 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత డ్వేన్‌ బ్రేవో (631; వెస్టిండీస్‌), సునీల్‌ నరైన్‌ (590; వెస్టిండీస్‌), ఇమ్రాన్‌ తాహిర్‌ (554; దక్షిణాఫ్రికా) మాత్రమే 500 క్లబ్‌లో ఉండగా ... తాజాగా ఈ జాబితాలో షకీబ్‌ (502) చేరాడు. అంతేకాదు ప్రస్తుతం టి20 క్రికెట్‌ చరిత్రలో 7000 పైచిలుకు పరుగులు, 500కు పైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ అతనొక్కడే కావడం మరో విశేషం.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)