Breaking News

హత్య కేసులో చిక్కుకున్న బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌..?

Published on Fri, 08/23/2024 - 15:28

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్ అల్ హ‌స‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డాడు. ఓ హత్యకు సంబంధించి షకీబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్ర‌కారం.. బంగ్లాదేశ్‌లో కొన‌సాగుతున్న నిర‌స‌నలలో ఆగ‌స్టు 7న గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్‌ మరణించాడు. 

అయితే తాజాగా త‌న కుమారుడ‌ని ఉద్దేశపూర్వ‌కంగానే హ‌త్య చేశార‌ని రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం ఢాకాలోని అడాబోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలోనే ష‌కీబ్‌తో పాటు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సహా మొత్తం 500 మందిపై పోలీసులు కేసు ఫైల్‌ చేసినట్లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఈ కేసులో షకీబ్‌ను 28వ నిందితుడిగా పేర్కొనగా.. ప్రముఖ బంగ్లాదేశ్ నటుడు ఫెర్దౌస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నాడు. కాగా వీరిద్ద‌రూ బంగ్లా పార్లమెంట్‌లో మాజీ అవామీ లీగ్ ఎంపీలు కావడం గమనార్హం. ఇక ష‌కీబ్ అల్‌హస‌న్ ప్ర‌స్తుతం పాకిస్తాన్‌లో ప‌ర్య‌టిస్తున్న బంగ్లాదేశ్ టెస్టు జ‌ట్టులో ఉన్నాడు.

అయితే కేసు న‌మోదు కావ‌డంతో అత‌డు స్వ‌దేశానికి తిరిగి వెళ్లే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అత‌డు పాక్‌తో జ‌రిగే రెండో టెస్టుకు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. బంగ్లాదేశ్‌లో హింస‌త్మాక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికి పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)