Breaking News

చ‌రిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్‌కే ప్లేయర్‌గా

Published on Tue, 04/15/2025 - 17:14

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత తిరిగి పుంజుకుంది. ఎక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. ఈ విజ‌యంలో కెప్టెన్‌ ధోని(26), దూబే(43), ర‌చిన్ ర‌వీంద్ర‌(37)ల‌ది కీల‌క పాత్ర.

సీఎస్‌కే గెలుపులో వీరు ముగ్గురుతో పాటు మ‌రో యువ ఆట‌గాడు కూడా త‌న వంతు పాత్ర పోషించాడు. అత‌డే భార‌త అండ‌ర్‌-19 టీమ్ మాజీ వైస్ కెప్టెన్‌, గుంటూరు కుర్రాడు షేక్ ర‌షీద్‌. షేక్ ర‌షీద్ సీఎస్‌కే త‌ర‌పున త‌న ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.

167 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో దూకుడుగా ఆడుతూ చెన్నైకి అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న ర‌షీద్‌.. 6 ఫోర్ల‌తో 27 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. మ‌రో ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌తో క‌లిసి తొలి వికెట్‌కు 52 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

సామ్ కుర్రాన్ రికార్డు బ‌ద్ద‌లు..
ఈ మ్యాచ్‌లో షేక్ ర‌షీద్ ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌ర‌పున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా ర‌షీద్ నిలిచాడు.  ఈ ఆంధ్రా ఆట‌గాడు కేవ‌లం 20 ఏళ్ల 202 రోజుల వ‌య‌స్సులో ఈ ఫీట్ సాధించాడు. అంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ కుర్రాన్ పేరిట ఉండేది.

కుర్రాన్ ఐపీఎల్‌-2020లో సీఎస్‌కే త‌ర‌పున 22 ఏళ్ల 132 రోజుల వ‌య‌స్సులో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. తాజా మ్యాచ్‌తో కుర్రాన్ ఆల్‌టైమ్ రికార్డును ర‌షీద్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ర‌షీద్‌ను రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌కు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ర‌షీద్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 19 ఫ‌స్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 37. 62 సగటుతో 1204 పరుగులు చేశాడు. అంతేకాకుండా 12 లిస్ట్‌-ఎ, 17 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.
చ‌దవండి: ఐపీఎల్‌లో తొలి ‘డబుల్‌ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)