Breaking News

Shahid Afridi-Shaheen Afridi: ఒకే రోజు ఇరగదీసిన మామ అల్లుళ్లు

Published on Thu, 08/03/2023 - 18:47

పాకిస్తాన్‌ ఆటగాళ్లు, మామ అల్లుళ్లు షాహిద్‌ అఫ్రిది, షాహీన్‌ అఫ్రిదిలు వేర్వేరు క్రికెట్‌ లీగ్‌ల్లో ఒకే రోజు (ఆగస్ట్‌ 2) బంతితో రాణించారు. మామ షాహిద్‌ అఫ్రిది గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో సత్తా చాటితే.. ఆల్లుడు షాహీన్‌ అఫ్రిది ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌లో ఇరగదీశాడు. 

మెన్స్‌ హండ్రెడ్‌ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిది 10 బంతులు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. గ్లోబల్‌ టీ20 లీగ్‌లో వాంకోవర్‌ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిద్‌ అఫ్రిది 4 ఓవర్లు వేసి కేవలం 16 మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు అఫ్రిదిలు వికెట్లు పడగొట్టాక ఒకే తరహాలో చేసుకున్న సెలబ్రేషన్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. షాహిద్‌, షాహీన్‌లు వికెట్‌ పడగొట్టాక రెండు చేతులు పైకి లేపి అచ్చు గుద్దినట్లు సంబురాలు చేసుకున్నారు. 

కాగా, మామ అల్లుళ్లు ఒకే రోజు ఒకే తరహాలో సెలబ్రేషన్స్‌ చేసుకున్నప్పటికీ.. ఒక్కరు మాత్రమే జట్టు విజయంలో భాగమయ్యారు. షాహీన్‌ జట్టు వెల్ష్‌ఫైర్‌.. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌పై 9 పరుగుల తేడాతో గెలుపొందగా.. షాహిద్‌ జట్టు టొరొంటో నేషనల్స్‌.. వాంకోవర్‌ నైట్స్‌ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లతో రాణించిన షాహీన్‌.. ఆతర్వాత తాను వేసిన 5, 6, 7, 8, 10 బంతులకు బౌండరీలు సమర్పించుకోవడం విశేషం.  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)