Breaking News

‘పాకిస్తాన్‌కు టీమిండియా రావాల్సిందే.. మేమైతే’

Published on Tue, 07/30/2024 - 17:31

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల త‌ర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్య‌మివ్వ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ మెగా ఈవెంట్‌ను విజ‌యంతంగా నిర్వ‌హించాల‌ని పాక్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తుంది.

ఇప్ప‌టికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను సైతం పీసీబీ.. ఐసీసీకి పంపింది. అయితే ఈ మెగా టోర్నీలో భార‌త్ పాల్గోంటుందా లేదా అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న రాజకీయ ఉద్రిక్త‌తలు,  భ‌ద్ర‌తా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. 

ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని డిమాండ్ చేస్తోంది. కానీ పీసీబీ మాత్రం ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని మొండి పట్టు పట్టింది.

ఈ ​‍నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి రావడానికి భారత్‌కు ఇష్టం లేదని, భద్రతను సాకుగా ఉపయోగించుకుంటుం‍దని అఫ్రిది ఆరోపించాడు. ఇప్పటికే చాలా మంది పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టు తమ దేశానికి రావాలని వాదిస్తున్నారు.

"మేము క్లిష్లమైన పరిస్ధితుల్లో కూడా ఆడేందుకు భారత్‌కు చాలాసార్లు వెళ్లాం. మాకు బెదిరింపులు వచ్చిన సందర్భాల్లో కూడా మేము భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడాము. మమ్మల్ని భారత్‌కు పంపేందుకు మా దేశ ప్రభుత్వం గానీ, పీసీబీ గానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

గతేడాది కూడా మా జట్టు వరల్డ్‌కప్‌లో తలపడేందుకు భారత్‌కు వెళ్లింది. మేము ఎప్పుడూ భారత్‌కు సపోర్ట్‌గా ఉంటాము. కాబట్టి వారు కూడా ఇక్కడకు వచ్చి ఆడాలని నేను కోరుకుంటున్నానని" అఫ్రిది ఓ పాక్ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)