Breaking News

పాకిస్తాన్ కెప్టెన్సీకి షాహీన్ షా ఆఫ్రిది గుడ్ బై..? కొత్త సారథి ఎవరంటే?

Published on Sat, 03/30/2024 - 18:22

పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీ నుంచి షాహీన్ షా ఆఫ్రిది తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత బాధ్యత వహిస్తూ అఫ్రిది తన పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అఫ్రిదికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ,జాతీయ సెలెక్టర్ల మధ్య పెద్దగా కమ్యూనికేషన్ కూడా లేనిట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దీంతో పీసీబీ తీరు పట్ల అఫ్రిది ఆంసృప్తితో ఉన్నట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి సాధారణ ఆటగాడిగా కొనసాగాలని షాహీన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజాం పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. 

వచ్చేనెల 18నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బాబర్‌ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.  కాగా గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో జట్టు దారుణ వైఫల్యం తర్వాత మూడు ఫార్మాట్లలో ఆజమ్‌ కెప్టెన్సీపై వేటు పడింది.

ఆ తర్వాత టీ20 కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిది, టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను పీసీబీ నియమించింది. కానీ వీరిద్దరూ తమ మార్క్ చూపిచండంలో విఫలమయ్యారు. మసూద్ సారధ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను పాక్ కోల్పోగా.. షాహీన్ కెప్టెన్సీలో​ న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ 4-1 సిరీస్ ఓటమిని చవిచూసింది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)