Breaking News

శ్రీలంకతో టెస్టు సిరీస్‌.. పాక్‌ జట్టు ప్రకటన!స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు

Published on Sat, 06/17/2023 - 16:00

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్‌ ఆజం సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా గతేడాది నుంచి టెస్టు జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది.. శ్రీలంక సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

16 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది. అతడు చివరగా టెస్టుల్లో గతేడాది జూలైలో శ్రీలంకపై ఆడాడు. అదే విధంగా యువ ఆటగాళ్లు ముహమ్మద్ హురైరా,అమీర్ జమాల్‌కు తొలి సారి పాకిస్తాన్‌ టెస్టు జట్టులో చోటుదక్కింది. శ్రీలంక సిరీస్‌తో వీరిద్దిరూ రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉంది.

ఇక ఈ సిరీస్‌ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ 2023-25లో భాగంగా జరగనుంది. కానీ సిరీస్‌ జూలైలో జరగనుంది. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కానుంది. బాబర్‌ ఆజాం నేతృత్వంలోని పాక్‌ జట్టు జులై 9న శ్రీలంకకు పయనం కానున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు జూలై 3న కరాచీలో పాకిస్తాన్‌ జట్టు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకతో టెస్టులకు పాకిస్తాన్‌ జట్టు: బాబర్‌ అజాం (కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హురైరా, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది,షాన్ మసూద్.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)