Breaking News

షాహీన్‌ అఫ్రిదికి ఊహించని షాక్‌

Published on Sun, 06/07/2026 - 16:57

పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్‌ అఫ్రిదికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన రెడ్‌బాల్ శిక్షణ శిబిరంలో అతడికి చోటు దక్కలేదు. దీంతో షాహీన్ టెస్టు భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.

జూన్ 8 నుంచి జూలై 10 వరకు జరిగే రెడ్‌బాల్ క్యాంప్‌కు 22 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన పీసీబీ, షాహీన్ పేరును జాబితాలో చేర్చలేదు. అయితే జూన్ 15 నుంచి సెప్టెంబర్ 18 వరకు కొనసాగే వైట్‌బాల్ క్యాంప్‌లో మాత్రం అతడికి స్థానం కల్పించింది.

ఆస్ట్రేలియాపై మెరిసినా..
తాజాగా పాక్‌ ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలవడంలో (2-1) షాహీన్ కీలక పాత్ర పోషించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు తీసి, 3.86 ఎకానమీతో ఆకట్టుకున్నాడు.

అలాగే ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు సాధించాడు. అయినప్పటికీ రెడ్‌బాల్ క్యాంప్ నుంచి అతడిని తప్పించడంపై ఆశ్చర్యకరంగా ఉంది.

తీవ్ర విమర్శలు
ఇటీవలి కాలంలో పాక్‌ టెస్ట్‌ జట్టు ప్రదర్శనలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. బంగ్లాదేశ్‌ చేతిలో వరుసగా రెండోసారి వైట్‌వాష్‌కు గురికావడం, నాలుగు వరుస టెస్టుల్లో ఓడిపోవడం జట్టు ఘోర పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో భారీ మార్పులు చేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రెడ్‌బాల్ క్యాంప్‌లో స్టార్ ఆటగాళ్లు
రెడ్‌ బాల్‌ క్యాంప్‌లో షాహీన్‌కు చోటు దక్కకపోయినా.. బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌, షాన్‌ మసూద్‌, సల్మాన్‌ అఘా, ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఆమిర్‌ జమాల్‌ వంటి ప్రముఖులకు అవకాశం లభించింది.

ఇదిలా ఉంట, పాక్‌ తదుపరి టెస్ట్‌ మ్యాచ్‌లు జులై ఆఖర్లో ఆడాల్సి ఉంది. జులై 25 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు విండీస్‌లో పర్యటించనుంది. ఈ సిరీస​్‌తో పాటు తదుపరి టెస్ట్‌ షెడ్యూల్‌ దృష్ట్యా పాక్‌ రెడ్‌ బాల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)