Breaking News

పాక్‌కు భారీ షాక్‌.. షాహీన్‌ అఫ్రిదికి గాయం! ఆ సిరీస్‌కు దూరం?

Published on Tue, 09/24/2024 - 20:56

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందుకు పాకిస్తాన్‌కు భారీ షాక్ త‌గిలింది.  ఈ సిరీస్‌కు ఆ జ‌ట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయం కార‌ణంగా దూరమ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఛాంపియన్స్ వన్డేకప్‌ 2024లో లయన్స్ జ‌ట్టు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అఫ్రిది.. డాల్ఫిన్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా గాయప‌డ్డాడు.

ఈ మ్యాచ్‌లో అత‌డి మెకాలికి గాయ‌మైంది. డాల్ఫిన్స్‌ ఆల్‌రౌండర్‌ ఫహీమ్ అష్రఫ్ వేసిన ఓ డెలివరీ అఫ్రిది మోకాలిగా బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి ఇసుమంత కూడా తగ్గలేదు. 

దీంతో అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. కాగా అఫ్రిది మోకాలి గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. గత రెండేళ్లుగా మోకాలి గాయంతో పోరాడుతున్నాడు. జూలై 2022లో, శ్రీలంకతో జరిగిన తొలిసారి గాయపడ్డ అఫ్రిది.. ఆసియాకప్‌కు దూరమయ్యాడు.

గతేడాది కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ అదే మెకాలి గాయం కావడంతో పాక్‌ జట్టు మెనెజ్‌మెంట్‌ ఆందోళన చెందుతోంది. షాహీన్‌ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ వన్డే కప్‌ ప్లే ఆఫ్స్‌కు దూరకావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌ సమయానికి అఫ్రిది ఫిట్‌నెస్‌ సాధించాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం  ఇంగ్లండ్‌ జట్టు పాక్‌లో పర్యటించనుంది. ఆక్టోబర్‌ 7 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)