Breaking News

పంజాబ్ కింగ్స్ ఓన‌ర్‌తో షారుక్ ఖాన్ తీవ్ర వాగ్వాదం.. కార‌ణ‌మిదే?

Published on Thu, 08/01/2024 - 07:54

ఐపీఎల్‌-2025 సీజ‌న్ మెగా వేలానికి ముందు ఆట‌గాళ్ల  రిటెన్షన్‌లు  చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్‌ చేసుకొనే వెసులుబాటు క‌ల్పించాల‌ని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఇదే విష‌యాన్ని  బుధ‌వారం( జులై 31) జ‌రిగిన ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ మీటింగ్‌లో ఆయా ప్రాంఛైజీల ఓన‌ర్లు ప్ర‌స్తావించారు. కానీ ఐపీఎల్ గవ‌ర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖ‌త చూపిన‌ట్లు తెలుస్తోంది. అందుకు బ‌దులుగా  ముగ్గురు ఆన్ క్యాప్డ‌డ్ ప్లేయ‌ర్ల‌ను రిటైన్‌ చేసుకునే అవకాశాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీల‌కు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. 

అయితే ఈ నిర్ణ‌యాన్ని ఒక‌ట్రెండు ఫ్రాంచైజీల ఓన‌ర్ల మిన‌హా దాదాపు అంద‌రూ అంగీక‌రించిన‌ట్లు వినికిడి. అయితే ఇదే విష‌యంపై కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

క్రిక్ బ‌జ్ రిపోర్ట్ ప్ర‌కారం.. షారుక్ ఖాన్  క‌చ్చితంగా రిటైన్ చేసే ఆట‌గాళ్ల సంఖ్య‌ను పెంచాల‌ని ప‌ట్టు ప‌ట్టిన‌ట్లు స‌మాచారం. కానీ నెస్ వాడియా మాత్రం  ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు క‌ల్పించవ‌ద్ద‌ని, మెగా వేలం వైపు మెగ్గు చూపిన‌ట్లు క్రిక్ బ‌జ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్‌ ప్రకారం.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్‌ చేసుకునే అవకాశముంది.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు