Breaking News

షఫాలీ ‘హ్యాట్రిక్‌’

Published on Wed, 03/19/2025 - 04:02

గువాహటి: డాషింగ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మ జాతీయ టోర్నీలో బంతితో మెరిసింది. మహిళల అండర్‌–23 వన్డే ట్రోఫీలో ‘హ్యాట్రిక్‌’ వికెట్లతో అదరగొట్టింది. దీంతో హరియాణా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హరియాణా జట్టు 6 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 49.3 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌటైంది. 

ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌ వేసిన షఫాలీ వర్మ (3/20) ఐదో బంతికి సలోని (50 బంతుల్లో 30; 4 ఫోర్లు), ఆరో బంతికి సౌమ్య వర్మ (0)లను అవుట్‌ చేసింది. మళ్లీ 46వ ఓవర్‌ వేసిన ఆమె తొలి బంతికే నమిత డిసౌజా (1)ను బౌల్డ్‌ చేయడంతో ‘హ్యాట్రిక్‌’ పూర్తయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి గెలిచింది. 

ఓపెనింగ్‌ చేసిన షఫాలీ (18) తక్కువ స్కోరుకే పరిమితం కాగా, సోనియా (79 బంతుల్లో 66; 8 ఫోర్లు), తనీషా (77 బంతుల్లో 77 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో రాణించారు. ఇటీవలే ముగిసిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో షఫాలీ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున విశేషంగా రాణించింది. అయితే ఫైనల్లో ఢిల్లీ మళ్లీ ఓడి వరుసగా మూడోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ముంబై ఇండియన్స్‌ రెండో డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ను సాధించింది. 

ఈ సీజన్‌ లీగ్‌ టాప్‌ స్కోరర్లలో ఆమె 304 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈమె కంటే ముందు వరుసలో నాట్‌ సివర్‌ (523), ఎలీస్‌ పెరి (372), హేలీ మాథ్యూస్‌ (307) ఉన్నారు. భారత బ్యాటర్లలో షఫాలీనే టాప్‌ స్కోరర్‌! గతేడాది టి20 ప్రపంచకప్‌ అనంతరం జట్టులో స్థానం కోల్పోయిన ఆమె తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేందుకు పట్టుదలగా రాణిస్తోంది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)