Breaking News

మళ్లీ టాప్‌–10లోకి షఫాలీ వర్మ

Published on Wed, 07/16/2025 - 04:12

దుబాయ్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌–10లోకి దూసుకొచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 176 పరుగులతో మెరిసిన షఫాలీ... ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 655 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌కు చేరింది. ఫామ్‌లో లేని కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన షఫాలీ పునరాగమనంలో ఇంగ్లండ్‌పై 158.56 స్ట్రయిక్‌రేట్‌తో ఆకట్టుకుంది. దాని ఫలితంగానే ర్యాంకింగ్స్‌లో ముందంజ వేసింది. 

ఈ జాబితాలో భారత్‌ నుంచి స్మృతి మంధాన (767 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. బెత్‌ మూనీ (794 పాయింట్లు; ఆ్రస్టేలియా), హీలీ మాథ్యూస్‌ (774 పాయింట్లు; వెస్టిండీస్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్‌కు పరిమితం కాగా... కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 15వ స్థానంలో కొనసాగుతోంది. 

బౌలింగ్‌ విభాగంలో భారత స్పిన్నర్‌ దీప్తి శర్మ (732 పాయిట్లు) ఒక స్థానం కోల్పోయి 3వ ర్యాంక్‌లో ఉండగా... రాధా యాదవ్‌ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 15వ ర్యాంక్‌కు చేరింది. పాకిస్తాన్‌ బౌలర్‌ సాదియా ఇక్బాల్‌ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాదీ బౌలర్‌ అరుంధతి రెడ్డి నాలుగు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌లో నిలిచింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)