Breaking News

చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్‌".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో

Published on Fri, 06/28/2024 - 16:31

చెపాక్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో భార‌త ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ చ‌రిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 

సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్‌లు బాదుతూ  షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. 

ఓవరాల్‌గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్‌.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా ష‌ఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. 

తాజా మ్యాచ్‌లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది.


 

Videos

అంబాలా ఎయిర్ బేస్ లో రాష్ట్రపతి ముర్ము సాహసం!

భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక

Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి

APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు

డ్రగ్స్ మాఫియాపై ఎటాక్.. 64 మంది మృతి..

Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు

బాబు వద్దనుకున్న గ్రామ సచివాలయ సిబ్బందే కీలక పాత్ర పోషించారు..

Jains Nani: ప్రొడ్యూసర్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు

టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ని బయటపెట్టిన శైలజానాథ్

ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు

Photos

+5

ఒంటరిగా మాల్దీవులు టూర్‌లో నమ్రత (ఫొటోలు)

+5

నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్‌ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్‌ (ఫొటోలు)

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)