Breaking News

ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో షఫాలీ

Published on Sat, 12/06/2025 - 03:13

దుబాయ్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో నవంబర్‌ నెలలో ఆమె ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తుది జాబితాలో షఫాలీకి చోటు దక్కింది. భారత్‌ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలుపొందడంలో షఫాలీ కీలకపాత్ర పోషించింది. 

దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆమె 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. ప్రతీక రావల్‌ గాయపడటంతో అనూహ్యంగా సెమీస్, ఫైనల్‌ ఆడే అవకాశం దక్కగా ఏకంగా ఆల్‌రౌండ్‌ షోతో భారత వరల్డ్‌కప్‌ స్టార్‌ అయ్యింది. తాజాగా అవార్డు రేసులోనూ ఉంది. ఆమెతో పాటు ఈ అవార్డు కోసం ఈషా ఒజా (యూఏఈ), తిపత్చా పుతవాంగ్‌ (థాయ్‌లాండ్‌)లు కూడా పోటీ పడుతున్నారు. 

ఐసీసీ ప్రారంభించిన మహిళల ఎమర్జింగ్‌ నేషన్స్‌ ట్రోఫీలో (బ్యాంకాక్‌)లో వీళ్లిద్దరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పురుషుల విభాగంలో నవంబర్‌ నెలకు గాను సఫారీ స్పిన్నర్‌ హార్మర్, బంగ్లాదేశ్‌ బౌలర్‌ తైజుల్‌ ఇస్లామ్, పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ నవాజ్‌లు ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు రేసులో ఉన్నారు. భారత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా నెగ్గడంలో హార్మర్‌ కీలక భూమిక పోషించాడు.   

#

Tags : 1

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు