Breaking News

IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్‌ అధికారి భార్య

Published on Tue, 05/06/2025 - 17:21

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా మే 3న జరిగిన ఆ​ర్సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌ సందర్భంగా ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో వీవీఐపీ ప్రేక్షకుల బాక్స్‌లో (బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో) రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒక కుటుంబం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రముఖులకు చెందినది కాగా.. మరో కుటుంబం సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కుటుంబానికి చెందినది. 

ఈ రెండు కుటుంబాల మధ్య సీట్ల విషయంలో మొదలైన గొడవ చివరికి పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఐపీఎల్‌ అధికారి భార్య ప్రత్యర్థి వర్గంపై లైంగి​క వేధింపుల కేసు పెట్టింది. ఆమెను, ఆమె కుమార్తెను లైంగిక​ంగా వేధించారని కబ్బన్‌ పార్క్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే, నువ్వా నేనా అన్నట్లు సాగిన ఆ మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. జేకబ్‌ బేతెల్‌ (55), విరాట్‌ కోహ్లి (62), రొమారియో షెపర్ట్‌ (53 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 

ఆఖర్లో షెపర్ట్‌ సునామీలా విరుచుకుపడి ఆర్సీబీకి భారీ స్కోర్‌ అందించాడు. షెపర్డ్‌ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్‌ సెంచరీ ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో వేగవంతమైంది.

ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్‌ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్‌కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. 

చివరి ఓవర్‌లో సీఎస్‌కే గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. యశ్‌ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. జడేజా, ధోని, దూబే లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా 12 పరుగులకే పరిమితం చేశాడు. 

#

Tags : 1

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు