Breaking News

మోండో ట్రాక్‌ ఏర్పాటు...

Published on Sat, 08/30/2025 - 01:42

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం రోజున పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. నేషనల్‌ స్టేడియంలో ధ్యాన్‌చంద్‌ విగ్రహానికి పూలమాల వేసి క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నివాళి అర్పించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్పోర్ట్స్‌ బిల్‌ వల్ల మన క్రీడారంగం దశ, దిశ మారిపోతాయని... భవిష్యత్తులో అత్యుత్తమ క్రీడా వేదికగా భారత్‌ నిలుస్తుందని మాండవీయ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని మన దేశంలోని క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన మోండో అథ్లెటిక్‌ ట్రాక్‌ను మంత్రి ప్రారంభించారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ ట్రాక్‌లో సెప్టెంబర్‌ 26 నుంచి వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి, మాజీ అథ్లెట్‌ అంజూ బాబీజార్జ్‌తో పాటు పలువురు క్రీడాకారులు, క్రీడాధికారులు కలిసి సరదాగా మైదానంలో పలు ఆటలు ఆడి సంబరాలు చేసుకున్నారు. 

మరోవైపు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశంలో ఆటగాళ్ల ఘనతలు గుర్తు చేస్తూ వారిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, అభినవ్‌ బింద్రా... యువ క్రీడాకారులు ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో అగ్రస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)