Breaking News

టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసకర శతకం

Published on Mon, 12/15/2025 - 22:43

బిగ్‌బాష్‌ లీగ్‌ 2025లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ ఘనంగా బోణీ కొట్టింది. బ్రిస్బేన్‌ హీట్‌తో ఇవాళ (డిసెంబర్‌ 15) జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసి.. ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 102; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

రెనెగేడ్స్‌ ఇన్నింగ్స్‌లో ఓలివర్‌ పీక్‌ (29 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. మిగతా ఆటగాళ్లలో జోష్‌ బ్రౌన్‌ 15, మహ్మద్‌ రిజ్వాన్‌ 4, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ 14, హస్సన్‌ ఖాన్‌ 5 (నాటౌట్‌), కెప్టెన్‌ విల్‌ సదర్‌ల్యాండ్‌ 3 (నాటౌట్‌) పరుగులు చేశారు. బ్రిస్బేన్‌ బౌలర్లలో జాక్‌ విల్డర్‌ముత్‌ 3 వికెట్లు తీయగా.. ప్యాట్రిక్‌ డాక్లీ, జేవియర్‌ బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్‌  గెలుపు కోసం విఫలయత్నం చేసింది. ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హగ్‌ వెబ్‌జెన్‌ (20 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తొమ్మిదో నంబర్‌ ఆటగాడు జిమ్మీ పియర్సన్‌ (22 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. 

ఈ ముగ్గురు చెలరేగినా బ్రిస్బేన్‌ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. మిగతా బ్రిస్బేన్‌ ఆటగాళ్లలో కెప్టెన్‌ మెక్‌స్వీని 9, మ్యాట్‌ రెన్షా 18, మ్యాక్స్‌ బ్రయాంట్‌ 14, బార్ట్‌లెట్‌ 1, లియామ్‌ హాస్కెట్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. జాక్‌ విల్డర్‌ముత్‌, షాహీన్‌ అఫ్రిది డకౌటయ్యారు. విల్‌ సదర్‌ల్యాండ్‌ 3, గురిందర్‌ సంధు, బెహ్రెన్‌డార్ఫ్‌ తలో 2 వికెట్లు తీసి బ్రిస్బేన్‌ను దెబ్బకొట్టారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)