Breaking News

IPL 2025: రోహిత్‌ చాలా అనాసక్తిగా ఆడుతున్నాడు.. భారత మాజీ క్రికెటర్‌ సంచలన ఆరోపణలు

Published on Tue, 05/27/2025 - 18:39

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను 13 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్‌ సెంచరీల సాయంతో 329 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్‌ ఈ సీజన్‌లో ఓ మోస్తరుగా రాణిస్తున్నా విమర్శకులు అతన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

రోహిత్‌ ప్రదర్శనలు ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. హిట్‌మ్యాన్‌ చాలా నిర్లక్ష్యంగా, అనాసక్తిగా ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. తాజాగా హిట్‌మ్యాన్‌ వ్యతిరేకులతో భారత మాజీ బౌలర్‌ అతుల్‌ వాసన్‌ కూడా గళం కలిపాడు.

ఈ సీజన్‌లో రోహిత్‌ ప్రదర్శనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడా జీవితంలో అన్ని సాధించాక రోహిత్‌ చాలా అనాసక్తిగా కనిపిస్తున్నాడంటూ కామెంట్‌ చేశాడు. రోహిత్‌లో ప్రేరణ కొరవడిందని అన్నాడు. ప్రేరణ కోసం అతను లక్ష్యాలను సెట్‌ చేసుకోవాలని సూచించాడు.

వాసన్‌ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ అతని అభిప్రాయంతో ఏకీభవించాల్సిందే. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ కోల్పోయినప్పటి నుంచి రోహిత్‌లో ఏదో తెలినీ తేడా కనిపిస్తుంది. మునుపటిలా అతను జట్టు కోసం ఆడటం లేదు. చాలా నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్‌ పారేసుకుంటున్నాడు. 

ఈ సీజన్‌లోనూ అదే జరిగుతుంది. ఒకటి, రెండు మ్యాచ్‌లు మినహా రోహిత్‌ శ్రద్దగా ఆడింది లేదు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగుతూ జట్టు జయాపజయాల పట్ల పట్టీపట్టనట్లున్నాడు. టీమ్‌లో అతని ఇన్వాల్మెంట్‌ ఎక్కడా కనిపించడం​ లేదు. ఎవరి కోసమో అడుతున్నా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. 

కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో అతని బాండింగ్‌ మొదటి నుంచే మిస్‌ అయినట్లు కనిపిస్తుంది. రోహిత్‌ అభిమానులు పైకి ఏమీ చెప్పలేకపోతున్నా అసలు విషయం వారికి బాగా తెలుసు. తమ ఆరాధ్య ఆటగాడు వంద శాతం కమిట్‌మెంట్‌తో ఆడటం లేదని లోలోపల వారూ మదనపడుతున్నారు.

సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులు, రికెల్టన్‌ ప్రతిభ, బౌలర్ల కష్టంతో ముంబై ఇండియన్స్‌ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆ జట్టు నెగ్గుకొస్తుందన్న ఆశలు లేవు. అదే రోహిత్‌ వంద శాతం కమిట్‌మెంట్‌తో ఆడితే ఫలితం అనుకూలంగా రావచ్చు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)