Breaking News

టాస్‌ కూడా పడకుండానే రద్దైన ఇంగ్లండ్‌ మ్యాచ్‌

Published on Fri, 09/19/2025 - 22:25

డబ్లిన్‌ వేదికగా ఇంగ్లండ్‌-ఐర్లాండ్‌ మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 19) జరగాల్సిన రెండో టీ20 వర్షార్పణం అయ్యింది. భారీ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ క్యాన్సిల్‌ అయ్యింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని చివరి టీ20 డబ్లిన్‌ వేదికగానే సెప్టెంబర్‌ 21న జరుగనుంది.

తొలి మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్‌ ‍ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐర్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ అంచనాలకు మించి రాణించి భారీ స్కోర్‌ చేసింది. హ్యారీ టెక్టార్‌ (36 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్‌ టక్కర్‌ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.  

ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ (34), రాస్‌ అదైర్‌ (26) కూడా సత్తా చాటారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓవర్టన్‌, డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఫిల్‌ సాల్ట్‌ (46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు) తొలి బంతి నుంచే చెలరేగడంతో మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ (10 బంతుల్లో 28), జేకబ్‌ బేతెల్‌ (16 బంతుల్లో 24), సామ్‌ కర్రన్‌ (15 బంతుల్లో 27) కూడా రాణించారు. ఐరిష్‌ బౌలర్లలో హంఫ్రేస్‌, హ్యూమ్‌ తలో 2, హ్యారీ టెక్టార్‌, గెరాత్‌ డెలానీ చెరో వికెట్‌ తీశారు.

 

 

 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)