Breaking News

దబంగ్‌ ఢిల్లీ శుభారంభం

Published on Wed, 09/03/2025 - 02:35

విశాఖ స్పోర్ట్స్‌: మాజీ చాంపియన్‌ దబంగ్‌ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ 41–34తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. కెప్టెన్  అశు మలిక్‌ (15 పాయింట్లు) ముందుండి జట్టును గెలిపించాడు. రెయిడింగ్‌లో అదరగొట్టాడు. 23 సార్లు కూతకెళ్లిన కెప్టెన్   12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మరో రెయిడర్‌ నీరజ్‌ నర్వాల్‌ (7) ఆకట్టుకున్నాడు. వీరిద్దరి శ్రమకు ఊతమిచ్చేలా... డిఫెండర్లు సౌరభ్‌ నందల్‌ (3), ఫజల్‌ అత్రాచలి (3), సుర్జీత్‌ సింగ్‌ (3) సమష్టిగా రాణించారు. 

ప్రత్యర్థి రెయిడర్లను అద్భుతంగా టాకిల్‌ చేశారు. బెంగళూరు జట్టులో ఆల్‌రౌండర్‌ అలీరెజా మిర్జాయిన్‌ (10), రెయిడర్‌ ఆశిష్‌ మలిక్‌ (8) మెరుగ్గా ఆడారు. అయితే సహచరుల నుంచి సరైన సహకారం లేక బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. విశాఖ అంచెలో బెంగళూరు బుల్స్‌ ఇంకా బోణీ కొట్టలేకపోయింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్‌ జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ 39–36తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. జైపూర్‌ రెయిడర్లు నితిన్‌ కుమార్‌ (13), అలీ చౌబ్తరష్‌ (8) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చారు. 

పట్నా జట్టులో రెయిడర్లు మణీందర్‌ సింగ్‌ (15), సుధాకర్‌ (9), అయాన్‌ (6) అద్భుతంగా రాణించినప్పటికీ డిఫెండర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. పైరేట్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్‌ వారియర్స్‌; హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా తలపడతాయి. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం మూడు జట్లు పుణేరి పల్టన్, యూపీ యోధాస్, యు ముంబా జట్లు నాలుగు పాయింట్లతో ‘టాప్‌’లో ఉన్నాయి. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)