Breaking News

Champions Trophy: న్యూజిలాండ్‌కు ఊహించని షాక్‌..

Published on Fri, 02/14/2025 - 13:53

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు ముగింట న్యూజిలాండ్‌ను గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే స్టార్ ప్లేయ‌ర్లు లాకీ ఫెర్గూస‌న్‌, ర‌చిన్ ర‌వీంద్ర గాయాల బారిన ప‌డ‌గా.. తాజాగా యువ పేస‌ర్ బెన్ సియ‌ర్స్ ఈ జాబితాలోకి చేరాడు. సియ‌ర్స్ తొడ కండరాల గాయం కార‌ణంగా ఈ మెగా టోర్నీకి దూర‌మ‌య్యాడు.

ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీక‌రించింది. అత‌డి స్ధానాన్ని మ‌రో పేస‌ర్ జాక‌బ్ డ‌ఫీతో న్యూజిలాండ్ క్రికెట్ భ‌ర్తీ చేసింది. సియ‌ర్స్ ప్ర‌స్తుతం పాకిస్తాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ట్రైసిరీస్‌లో కివీస్ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. అయితే పాకిస్తాన్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెష‌న్‌లో సియ‌ర్స్ తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి.

అనంత‌రం అత‌డిని స్కానింగ్‌కు త‌ర‌లించ‌గా.. గ్రేడ్‌-3 గాయంగా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ యువ ఆట‌గాడు రెండు నుంచి మూడు వారాల పాటు ఆట‌కు దూరం కానున్నాడు. ఈ క్ర‌మంలోనే కివీస్ సెల‌క్ట‌ర్లు అత‌డి స్ధానాన్ని జాకబ్ డఫీతో భ‌ర్తీ చేశారు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్ అద్బుత‌మైన ఫామ్‌లో ఉంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ముక్కోణ‌పు సిరీస్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధించింది. శుక్ర‌వారం కరాచీ వేదిక‌గా పాక్‌తో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లోనూ ఇదే జోరును కొన‌సాగించాల‌ని కివీస్ భావిస్తోంది. అయితే ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు కివీ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర సైతం దూర‌మ‌య్యాడు.

పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర తలకు గాయమైంది. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభానికి అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని బ్లాక్‌క్యాప్స్‌ హెడ్‌కోచ్‌ గ్యారీ స్టెడ్‌ స్పష్టం చేశాడు. ఇక ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న పాక్‌తో తలపడనుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి కివీస్‌ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర,జేకబ్‌ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
చదవండి: Champions Trophy: ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా?

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)