Breaking News

Ranji- శార్దూల్‌ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్‌

Published on Mon, 03/11/2024 - 14:22

దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. శార్దూల్‌ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు.

కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్‌ ఠాకూర్‌ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు.

అలా అయితే కష్టమే కదా
తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. 

ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్‌ మ్యాచ్‌లకు మూడు రోజులు, నాకౌట్‌ మ్యాచ్‌లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు.

శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే
ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్‌పై టీమిండియా 4-1 సిరీస్‌ విజయం తర్వాత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్‌ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు.

ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే.

కాబట్టి..  ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్‌ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ శార్దూల్‌ ఠాకూర్‌ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)