Breaking News

టైటిల్‌తో పునరాగమనం.. సిడ్నీ క్లాసిక్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత స్క్వాష్‌ స్టార్‌ సౌరవ్‌

Published on Mon, 02/24/2025 - 07:43

న్యూఢిల్లీ: భారత స్క్వాష్‌ స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆట నుంచి వీడ్కోలు తీసుకున్న 38 ఏళ్ల సౌరవ్‌ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్‌ పట్టాడు. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన ఆక్టేన్‌ ఓపెన్‌ సిడ్నీ క్లాసిక్‌ స్క్వాష్‌ చాలెంజర్‌ టోర్నీలో సౌరవ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ మాజీ పదో ర్యాంకర్‌ సౌరవ్‌ 11–2, 11–6, 11–2తో ఈజిప్ట్‌ దేశానికి చెందిన అబ్దుల్‌ రెహమాన్‌ నాసర్‌పై గెలుపొందాడు. 

ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించిన సౌరవ్‌... ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ మాత్రమే కోల్పోవడం విశేషం. సెమీఫైనల్లో సౌరవ్‌ 11–9, 5–11, 11–1, 11–2తో రైస్‌ డౌలింగ్‌ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 11–6, 11–6, 11–5తో మిన్‌వూ లీ (దక్షిణ కొరియా)పై, రెండో రౌండ్‌లో 11–8, 11–2, 11–8తో కిజాన్‌ (మాల్టా)పై గెలుపొందాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్‌కు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. 2003లో ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఏ) టూర్‌లో అరంగేట్రం చేసిన సౌరవ్‌ ఇప్పటి వరకు 11 పీఎస్‌ఏ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు. 18 టోరీ్నలలో రన్నరప్‌గా నిలిచాడు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)