Breaking News

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ పరాజయం

Published on Fri, 07/18/2025 - 03:50

టోక్యో: అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంక్‌ ద్వయం సాత్విక్‌–చిరాగ్‌ 22–24, 14–21తో ప్రపంచ ఆరో ర్యాంక్‌ జోడీ లియాంగ్‌ కె వెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా లియాంగ్‌–వాంగ్‌ జంట చేతిలో సాత్విక్‌–చిరాగ్‌ జోడీకిది ఆరో పరాజయం కావడం గమనార్హం. 

44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు గేముల్లోనూ ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత దానిని చేజార్చుకుంది. తొలి గేమ్‌లో 9–6తో, రెండో గేమ్‌లో 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సాత్విక్‌–చిరాగ్‌ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌... మహిళల సింగిల్స్‌లో అనుపమ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు. దాంతో ఈ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. 

ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 19–21, 11–21తో ఓటమి పాలయ్యాడు. నరోకా చేతిలో లక్ష్య సేన్‌కిది ఐదో పరాజయం. ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్‌ అనుపమ 21–13, 11–21, 12–21తో పోరాడి ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనుపమ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించలేకపోయింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)