ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Published on Sun, 09/14/2025 - 03:57

హాంకాంగ్‌: భారత బ్యాడ్మింటన్‌ అగ్ర శ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ కూడా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న భారత ఆటగాడు 23–21, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, మూడో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ని కంగు తినిపించాడు. సుమారు గంటపాటు హోరా హోరీగా జరిగిన సమరంలో లక్ష్యసేన్‌ ఏ దశలోనూ పట్టు సడలించలేదు.  

నేడు జరిగే టైటిల్‌ పోరులో చైనాకు చెందిన రెండో సీడ్‌ లి షి ఫెంగ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.  ఈ ఏడాది సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ సెమీస్‌తోనే ఆగిపోతున్నారు. ఆరు టోర్నీల్లో సెమీస్‌తోనే ముగిసిన భారత జోడీ పోరాటం ఇక్కడ ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్‌లో తొలిసారి సాత్విక్‌–చిరాగ్‌లు ఎట్టకేలకు టైటిల్‌ వేటలో అడుగు దూరంలో ఉన్నారు. 

తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య విజేత అయిన భారత డబుల్స్‌ జోడీ వరుస సెట్లలో చైనీస్‌ తైపీకి చెందిన బింగ్‌ వే లిన్‌–చెన్‌ చెంగ్‌ కున్‌ జంటను కంగుతినిపించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకులో ఉన్న సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–17, 21–15తో తైపీ జోడీని కంగుతినిపించింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఎనిమిదో సీడ్‌ భారత జోడీ... పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతక విజేతలైన లియాంగ్‌ వే కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) జంటతో తలపడుతుంది.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)