Breaking News

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ చరిత్ర

Published on Sat, 12/20/2025 - 03:34

కొన్నేళ్లపాటు భారత బ్యాడ్మింటన్‌లో సింగిల్స్‌లో షట్లర్లు దేశ ప్రతిష్ట పెంచారు. ‘చైనా’ గోడకు ఎదురునిలిచి సంచలన విజయాలు, ఒలింపిక్‌ పతకాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజయాలు, ప్రపంచనంబర్‌వన్‌ ర్యాంకింగ్స్‌తో షట్లర్లు ఘనతకెక్కారు. అయితే డబుల్స్‌లో మాత్రం ఆ స్థాయికి చేరలేదనే బెంగ ఉండేది. కానీ ఇప్పుడది గతం! వర్తమానంలో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ చెలరేగిపోతోంది. డబుల్స్‌ భవిష్యత్తును బంగారం చేయబోతోంది.   

హాంగ్జౌ: భారత డబుల్స్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలు కొత్త చరిత్ర లిఖించారు. ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా ఈ మెగా టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి భారత పురుషుల ద్వయంగా సాత్విక్‌–చిరాగ్‌ ఘనతకెక్కింది. ఈ టోర్నీలో ఈ జోడీ ఎదురేలేకుండా దూసుకెళుతోంది. ప్రపంచ అత్యుత్తమ, టాప్‌–8 జంటలే బరిలోకి దిగే ఈ మేటి టోర్నీలో గ్రూప్‌ ‘బి’లో ఉన్న సాత్విక్‌–చిరాగ్‌ జోడీ అజేయంగా నాకౌట్‌ దశకు అర్హత సంపాదించింది. 

చైనా గడ్డపై ప్రత్యర్థి జంటలను గడగడలాడిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా గెలిచి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. శుక్రవారం జరిగిన ఈ గ్రూపులోని ఆఖరి మూడో మ్యాచ్‌లో మూడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 17–21, 21–18, 21–15తో మలేసియాకు చెందిన రెండో సీడ్‌ అరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌లపై చెమటోడ్చి నెగ్గింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతలైన చియా– సో వుయ్‌లకు అసాధారణ పోరాటంతో చెక్‌పెట్టింది. 

ముఖాముఖీ పోటీల్లో 5–11తో వెనుకబడి వున్నప్పటికీ శుక్రవారం మాత్రం భారత జోడీ ప్రదర్శన మరో స్థాయిలో నిలిపింది. మింగుడు పడని ప్రత్యర్థి ద్వయం చేతిలో తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ ఏమాత్రం నిరాశపడకుండా తదుపరి గేముల్లో పట్టుదల కనబరిచింది. 

పాయింట్‌ పాయింట్‌కు చెమటోడ్చి రెండో గేమ్‌ను వశం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో అయిన చిరాగ్‌–సాత్విక్‌ల ఆటతీరుకు మలేసియన్‌ జోడీ తలొగ్గకతప్పలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం చైనాకు చెందిన లియాంగ్‌ వి కెంగ్‌–వాంగ్‌ చంగ్‌ జంటను ఢీకొట్టనుంది. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)