Breaking News

సాత్విక్‌ జోడీకి పతకం ఖాయం

Published on Sun, 08/31/2025 - 05:54

పారిస్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి పతకం ఖాయం చేసుకుంది. 2022లో ఈ టోరీ్నలో కాంస్య పతకం నెగ్గిన సాత్విక్‌ జోడీ... ఇప్పుడు రెండో పతకం కైవసం చేసుకోనుంది. తద్వారా 2011 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ల పతకాల పరంపర దిగి్వజయవంతంగా కొనసాగుతోంది. 

పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 21–12, 21–19తో ఆరోన్‌ చియా–సోహ్‌ వూయ్‌యిక్‌ (మలేసియా) ద్వయంపై విజయం సాధించింది. 43 నిమిషాల్లో ముగిసిన పోరులో రెండు సార్లు ఒలింపిక్‌ పతకాలు సాధించిన మలేసియా జోడీపై భారత జంట సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో మలేసియా షట్లర్ల చేతిలోనే ఓడి పతకానికి దూరమైన భారత ప్లేయర్లు... ఈ సారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు.

 ‘చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌లో పరాజయం తర్వాత ఏడాది అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మలేసియా జోడీపై నెగ్గడం సంతోషం. ఆరోన్‌ జంటతో ఆడటం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. మా మధ్య ఎన్నో రసవత్తర పోరాటాలు జరిగాయి. ఇప్పటి వరకు తలపడ్డ ప్రతీసారి వరుస గేమ్‌ల్లోనే ఫలితం వచి్చంది. అయినా వాటిలో ఉండే ఉత్కంఠ వేరే. 

ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకం ఖాయం కావడంతో మరింత ఆనందంగా ఉంది, రెండో గేమ్‌ సమయంలో నియంత్రణలో ఉండాలని అనుకున్నాం. పాయింట్ల కోసం తొందరపడకుండా... ఒక్కో అడుగు ముందుకు వేయాలని భావించాం. దాన్నే ఆచరణలో చూపాం’ అని మ్యాచ్‌ అనంతరం సాత్విక్‌–చిరాగ్‌ పేర్కొన్నారు. మ్యాచ్‌ ఆరంభంలోనే 59 షాట్‌ల సుదీర్ఘ ర్యాలీ ఆడిన భారత జంట... ఆ తర్వాత కూడా సుదీర్ఘ ర్యాలీలతో కట్టిపడేసింది. చిరాగ్‌ నెట్‌ వద్ద తన ప్రతిభ కనబర్చగా... సాత్విక్‌ సర్విస్‌తో ఆకట్టుకున్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)