Breaking News

సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఓటమి

Published on Sun, 12/21/2025 - 03:05

హాంగ్జౌ: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు నిరాశ తప్పలేదు. ప్రతిష్టాత్మక ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత పురుషుల ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి పరాజయం పాలయ్యారు. శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జంట 21–10, 17–21, 13–21తో లియాంగ్‌ వె కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గ్రూప్‌ దశలో ఈ జోడీపై సులువుగా గెలిచిన భారత జంట... సెమీస్‌లో అదే ఆటతీరు కనబర్చడంలో విఫలమైంది. 

తొలి గేమ్‌ గెలిచి ఆధిక్యంలో ఉన్న తర్వాత... అనవసర తప్పిదాలతో వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత షట్లర్లు ప్రత్యర్థి కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. అదే జోరులో తొలి గేమ్‌ సొంతం చేసుకున్న సాత్విక్‌–చిరాగ్‌ దాన్ని కొనసాగించలేకపోయారు. 

రెండో గేమ్‌లో 3–6తో వెనుకబడిన భారత ప్లేయర్లు ఆ తర్వాత 7–7, 11–11తో స్కోరు సమం చేశారు. దీంతో మ్యాచ్‌ నువ్వా నేనా అన్నట్లు సాగగా కీలక దశలో పాయింట్లు సాధించిన చైనా జంట గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక అదే జోరులో మూడో గేమ్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థి రెచ్చిపోగా... భారత జంట పోటీనివ్వలేక పరాజయం వైపు నిలిచింది.   

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)