Breaking News

సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Published on Sat, 01/11/2025 - 04:04

కౌలాలంపూర్‌: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనే లక్ష్యం దిశగా భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ఒక అడుగు ముందుకు వేసింది. మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 

శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 26–24, 21–15తో యె సిన్‌ ఓంగ్‌–ఈ యి టియో (మలేసియా) జోడీపై గెలిచింది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ తొలి గేమ్‌లో నాలుగు గేమ్‌ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. రెండో గేమ్‌లోనూ భారత జోడీకి గట్టిపోటీ లభించింది. 

ఒకదశలో సాత్విక్‌–చిరాగ్‌ 8–11తో వెనుకబడ్డారు. కానీ భారత జంట ఇదే స్కోరు వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 12–11తో ఆధిక్యంలోకి వచ్చిoది. ఆ తర్వాత స్కోరు 12–12తో సమమైంది. ఈ దశలో సాత్విక్‌–చిరాగ్‌ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేశారు. 

అదే జోరులో గేమ్‌ను సొంతం చేసుకున్న సాత్విక్‌–చిరాగ్‌ వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే సెమీఫైనల్లో కిమ్‌ వన్‌ హో–సియో సెయంగ్‌ జే (దక్షిణ కొరియా)లతో సాత్విక్‌–చిరాగ్‌ తలపడతారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)