Breaking News

సెమీఫైనల్లో సాత్విక్‌ జోడీ 

Published on Sat, 07/22/2023 - 04:04

యోసు (కొరియా): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట వరుస సెట్లలో ఐదో సీడ్‌ టకురో హొకి–యుగొ కొబయషి (జపాన్‌) ద్వయంపై అలవోక విజయం సాధించింది.

40 నిమిషాల్లో ముగిసిన ఈ క్వార్టర్స్‌ పోరులో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–14, 21–17తో జపాన్‌ ద్వయంపై గెలుపొందింది. గత నెల ఇండోనేసియా ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గి జోరు మీదున్న భారత షట్లరు ఈ టోరీ్నలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తొలి గేమ్‌ ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం గేమ్‌ గెలిచేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.

రెండో గేమ్‌లో భారత జోడీ 3–6తో కాస్త వెనుకపడినట్లు కనిపించింది. అయితే అక్కడి నుంచి సాత్విక్‌–చిరాగ్‌లిద్దరు తమ షాట్లకు పదునుపెట్టడంతో వరుసగా 6 పాయింట్లు గెలిచారు. అక్కడి నుంచి ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. 

ఇటీవలే ‘యోనెక్స్‌’ ఫ్యాక్టరీలో ల్యాబ్‌లో ఫాస్టెస్ట్‌ స్మాష్‌తో గిన్నిస్‌ రికార్డు నమోదు చేసిన సాత్విక్‌ సాయిరాజ్‌ కోర్టులోనూ ఈ సారి అలాంటి ఫీట్‌ను మళ్లీ సాధించడం విశేషం. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సాత్విక్‌ రికార్డు వేగంతో స్మాష్‌ బాదాడు. అతను కొట్టిన స్మాష్‌కు షటిల్‌ గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది.   

Videos

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)