Breaking News

శతక్కొట్టిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Published on Wed, 10/02/2024 - 13:06

రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీతో కదంతొక్కాడు. సర్ఫరాజ్‌ 150 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్‌ సెంచరీతో సత్తా చాటడంతో రెండో రోజు లంచ్‌ సమయానికి (94 ఓవర్లలో) ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌తో పాటు తనుశ్‌ కోటియన్‌ (26) క్రీజ్‌లో ఉన్నాడు.

ముంబై ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే (97), శ్రేయస్‌ అయ్యర్‌ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. పృథ్వీ షా 4, ఆయుశ్‌ మాత్రే 19, హార్దిక్‌ తామోర్‌ 0, షమ్స్‌ ములానీ 5 పరుగులకు ఔటయ్యారు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ దయాల్‌ రెండు వికెట్లు తీశాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 237/4 వద్ద ముంబై రెండో రోజు ఆట మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

15వ ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ
రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాపై చేసిన సెంచరీ సర్ఫరాజ్‌ ఖాన్‌కు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 15వది. ఈ సెంచరీతో సర్ఫరాజ్‌ యావరేజ్‌ 67 దాటింది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో అత్యుత్తమ యావరేజ్‌. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతనికి ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇరానీ కప్‌లోనూ అతనికి ఇది రెండో సెంచరీ.

చదవండి: ఇరానీ కప్‌.. రాణించిన రహానే, సర్ఫరాజ్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)