Breaking News

సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్‌.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ

Published on Sun, 06/15/2025 - 12:50

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు మ‌రో నాలుగు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఇప్ప‌టికే ఇంగ్లండ్‌పై గ‌డ్డ‌పై అడుగు పెట్టిన భార‌త జ‌ట్టు త‌మ ఆస్త్ర‌శాస్త్రాల‌ను సిద్దం చేసుకుంటుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

కాగా ఈ సిరీస్ స‌న్న‌హాకాల్లో భాగంగా బెకింగ్‌హ‌మ్ వేదిక‌గా భార‌త సీనియ‌ర్ జ‌ట్టు భార‌త-ఎ టీమ్‌తో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త‌-ఎకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సెంచ‌రీతో మెరిశాడు.

బీసీసీఐ వ‌ర్గాల స‌మాచారం.. ప్రకారం రెండో రోజు ఆట‌లో స‌ర్ఫరాజ్ టీ20 త‌ర‌హాలో త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.  76 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు.  తర్వాత ఇతరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్ అయ్యాడు. కాగా ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసిన‌ భార‌త జ‌ట్టులో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు చోటు ద‌క్క‌లేదు. అత‌డు స్ధానంలో క‌రుణ్ నాయ‌ర్‌కు అవ‌కాశ‌మిచ్చారు.

కానీ స‌ర్ఫరాజ్ ఇప్పుడు త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో సెల‌క్ట‌ర్లకు గ‌ట్టి స‌మాధాన‌మిచ్చాడు. బీసీసీఐ ఛీప్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్కర్‌, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)  హెడ్ వీవీయ‌స్ ల‌క్ష్మ‌ణ్ ముందే స‌ర్ఫరాజ్ ఈ సెంచ‌రీ సాధించిన‌ట్లు తెలుస్తోంది. అంత‌కుముందు ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా ఈ ముంబైక‌ర్ 92 పరుగులు చేశాడు.

ఈ క్ర‌మంలో స‌ర్ఫ‌రాజ్‌ను భార‌త జ‌ట్టుతో పాటు ఇంగ్లండ్‌లోనే ఉంచే అవ‌కాశ‌ముంది. ఇక ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో భార‌త సీనియ‌ర్ జ‌ట్టు 459 పరుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కొత్త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌, కేఎల్ రాహ‌ల్ హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా- ఎ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 299 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిషన్ 45 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ 35, శార్దుల్ ఠాకూర్ 19 ప‌రుగులు చేశారు.

బుమ్రా ఫెయిల్‌..
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నిరాశపరిచాడు. ఏడు ఓవర్లు వేసిన బుమ్రా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 36 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షదీప్ సింగ్ కూడా 12 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండానే 52 పరుగులు సమర్పించుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించారు.

ఇంగ్లండ్‌తో టెస్టుల‌కు భార‌త జ‌ట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్
చదవండి: వారిద్దరి వల్లే ఓడిపోయాము.. మా జట్టులో ఆ సమస్య ఉంది: ఆసీస్‌ కెప్టెన్‌
 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)