Breaking News

'స‌ర్ఫ‌రాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గ‌జాన్ని గుర్తు చేస్తున్నాడు'

Published on Sat, 10/19/2024 - 09:18

బెంగుళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న‌తొలి టెస్టులో భార‌త యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అద‌ర‌గొడుతున్నాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో డ‌కౌటైన స‌ర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో స‌త్తాచాటుతున్నాడు. శుబ్‌మ‌న్ గిల్ స్దానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన  26 ఏళ్ల ముంబైక‌ర్‌.. మూడో రోజు ఆట‌లో దుమ్ములేపాడు.

భార‌త పోరాటంలో కీల‌క పాత్ర పోషించాడు. స్వీప్‌, ర్యాంప్ షాట్‌లు ఆడుతూ స‌ర్ఫరాజ్ అల‌రించాడు. మూడు రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 70 పరుగులతో ఖాన్‌ అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు భార‌త్ త‌మ రిథ‌మ్‌ను కొన‌సాగించాలంటే వీలైనంత స‌మ‌యం పాటు స‌ర్ఫ‌రాజ్ క్రీజులో ఉండాలి. ఈ నేప‌థ్యంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ సంజయ్ మంజ్రేకర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.  స‌ర్ఫ‌రాజ్‌ను భార‌త దిగ్గ‌జ బ్యాట‌ర్ జావేద్ మియాందాద్‌తో మంజ్రేక‌ర్ పోల్చాడు.

"సర్పరాజ్ జావేద్ మియాందాద్‌ని గుర్తు చేస్తున్నాడు. 1980ల‌లో జావేద్ ఈ విధంగానే ఆడేవాడు. సర్పరాజ్ మియాందాద్ 2024 వెర్షన్. అత‌డు ఆట తీరు న‌న్ను ఎంతోగానే ఆకట్టుకుంది.  అతను స్పిన్‌ను బాగా ఆడతాడని మాకు తెలుసు, కానీ ఫాస్ట్ బౌలర్లను కూడా ఈ విధంగా ఆడుతాడని నేను అనుకోలేదు.

అత‌డికి అద్భుత‌మైన గేమ్ ప్లాన్ ఉంది.మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యంలో త‌న వికెట్‌ను కోల్పోకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. ఆఖ‌రిలో డిఫెన్స్ ఆడుతూ మూడో రోజు ఆట‌ను ముగించాడు. నాలుగో రోజు ఆట‌లో స‌ర్ఫ‌రాజ్ కీల‌కం కానున్నాడు. 

బౌన్స‌ర్ల‌ను కూడా స‌ర్ఫరాజ్ అద్బుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు ముందు భార‌త్‌కు ఇది నిజంగా శుభసూచకమ‌ని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంజ్రేక‌ర్ పేర్కొన్నాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల న‌ష్టానికి 231 ప‌రుగులు చేసింది. భార‌త్ ఇంకా 125 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది.
చదవండి: IND vs AUS: ఆసీస్‌ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్‌! తెలుగోడికి చోటు?

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)