Olympics: ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించిన సరబ్‌జోత్‌ సింగ్‌

Published on Sat, 08/10/2024 - 20:14

ఒలింపిక్‌ పతక విజేత, షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్యానా ప్రభుత్వం ఆఫర్‌ చేసిన ఉద్యోగాన్ని తాను స్వీకరించలేనన్నాడు. తన దృష్టి మొత్తం షూటింగ్‌పైనే కేంద్రీకృతమై.. ఉందని అందుకే ఈ ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపాడు. తాను ముందే కొన్ని కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నానని.. వాటికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు.

ప్రభుత్వం ఆఫర్‌ చేసిన ఉద్యోగం ఇదే 
కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో సరబ్‌జోత్‌ సింగ్‌ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి మూడోస్థానంలో నిలిచిన ఈ హర్యానా అథ్లెట్‌.. తొలిసారి ఒలింపిక్‌ పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అతడికి క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పదవిని ఆఫర్‌ చేసింది.

కారణం ఇదే
అయితే, సరబ్‌జోత్‌ సింగ్‌ మాత్రం ఇందుకు నో చెప్పాడు. ఒలింపిక్‌ పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చిన 22 ఏళ్ల సరబ్‌జోత్‌ అంబాలాలో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా... ‘‘ఇది మంచి ఉద్యోగమే. కానీ ఇప్పుడు దీనిని స్వీకరించలేను. షూటింగ్‌పైనే మరింతగా దృష్టి సారించాలనుకుంటున్నాను.

నా కుటుంబం కూడా ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటోంది. అయితే, నేను షూటర్‌గానే కొనసాగాలని భావిస్తున్నాను. నా లక్ష్యాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేను. అందుకే ప్రస్తుతం ఈ జాబ్‌ చేయలేను’’ అని సరబ్‌జోత్‌ సింగ్‌ తన మనసులో మాటను వెల్లడించాడు. కాగా రైతు కుటుంబంలో జన్మించిన సరబ్‌జోత్‌ ఎన్నో కష్టాలు దాటి షూటర్‌గా ఎదిగాడు.   

చదవండి: ఫుట్‌బాలర్ కావాలనుకున్నాడు.. క‌ట్ చేస్తే! షూట‌ర్‌గా ఒలింపిక్ మెడ‌ల్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)