నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్‌

Published on Thu, 08/21/2025 - 17:28

సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar).. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు సాధించాడు ఈ బ్యాటింగ్‌ దిగ్గజం. వీటిలో రెండు మాత్రం భారత్‌తో పాటు సచిన్‌కు ఎంతో ప్రత్యేకం.

శతక శతకాల ధీరుడు
అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించిన సచిన్‌ టెండుల్కర్‌.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేశాడు. అదే విధంగా.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో వంద శతకాలు (51 టెస్టు, 49 వన్డే) బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.  

తండ్రి అడుగుజాడల్లో అర్జున్‌
అయితే, సచిన్‌ టెండుల్కర్‌ సంతానంలో కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ మాత్రమే క్రికెట్‌ వైపు మొగ్గు చూపాడు. కానీ నైపుణ్యాల పరంగా తండ్రికి దరిదాపుల్లో కూడా అతడు లేడు. పాతికేళ్ల అర్జున్‌ ఆల్‌రౌండర్‌. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో గోవా తరఫున ఆడుతున్నాడు.

సారా మాత్రం భిన్నం
మరోవైపు.. సచిన్‌- అంజలిల మొదటి సంతానమైన సారా టెండుల్కర్‌ మాత్రం భిన్నమైన కెరీర్‌ను ఎంచుకుంది. మోడల్‌గా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, న్యూట్రీషనిస్టుగా తనకు నచ్చిన బాటలో పయనిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారాకు.. తండ్రిలా క్రికెట్‌ను ఎందుకు కెరీర్‌లా ఎంచుకోలేదనే ప్రశ్న ఎదురైంది.

నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే
ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనెప్పుడూ క్రికెటర్‌ కావాలని అనుకోలేదు. అయితే, మా తమ్ముడికి మాత్రం క్రికెట్‌ అంటే ఇష్టం. నేను చిన్నపుడు గల్లీ క్రికెట్‌ ఆడాను. కానీ దానినే కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు’’ అని ఇండియా టుడేతో సారా టెండుల్కర్‌ పేర్కొంది.

అదే విధంగా.. చిన్నపుడు తండ్రి మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి వెళ్లేదానినన్న సారా.. ఇప్పుడు కూడా టీమిండియా మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షిస్తానని తెలిపింది. తండ్రి రిటైర్మెంట్‌ మ్యాచ్‌ తనకింకా గుర్తుందని.. ఆ సమయంలో ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోగల పరిణతి మాత్రం అప్పుడు తనకు లేదని పేర్కొంది.

కాగా 1989 నుంచి 2013 వరకు టీమిండియా తరఫున క్రికెట్‌ ఆడిన సచిన్‌ టెండుల్కర్‌.. 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో పది పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌.. 2334 పరుగులు చేశాడు.

త్వరలోనే సచిన్‌ ఇంట శుభకార్యం
ఇక సచిన్‌ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. డాక్టర్‌ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా, అర్జున్‌. కాగా త్వరలోనే సచిన్‌ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌- సానియా చందోక్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. 

ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని బడా వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలే సానియా. ఇదిలా ఉంటే.. అక్క సారా కంటే ముందే తమ్ముడు అర్జున్‌ పెళ్లి పీటలు ఎక్కనుండటం విశేషం. 

చదవండి: హ్యాట్సాఫ్‌ ధనశ్రీ: రోహిత్‌ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)