Breaking News

టీమిండియా దిగ్గజం బర్త్‌డే.. సారా టెండుల్కర్‌ పోస్ట్‌ వైరల్‌

Published on Thu, 04/24/2025 - 17:16

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) పుట్టినరోజు నేడు (ఏప్రిల్‌ 24). ఈరోజు మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ 52వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) ఈ లెజెండరీ బ్యాటర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.

శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌
‘‘664 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 34,357 పరుగులు.. 201 అంతర్జాతీయ వికెట్లు.. 2011 వన్డే వరల్డ్‌కప్‌ విజేత.. కల్నల్‌ సీకే నాయుడు జీవనసాఫల్య పురస్కారం అందుకున్న విజేత..

అంతర్జాతీయ క్రికెట్‌లో శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌.. దిగ్గజ, స్ఫూర్తిదాయక ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ఎక్స్‌ వేదికగా విషెస్‌ చెప్పింది. మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా, ఏబీ డివిలియర్స్‌ తదితరులు సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

హ్యాపీ బర్త్‌డే బాబా
ఇక సచిన్‌ టెండుల్కర్‌ కుమార్తె సారా టెండుల్కర్‌ తండ్రి బర్త్‌డే సందర్భంగా తాను అమూల్యంగా భావించే ఫొటోలను పంచుకుంది. అంతేకాదు తన తండ్రి గొప్పదనాన్ని వివరిస్తూ.. ‘‘ఎవరికీ భయపడొద్దు.. అయితే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని నేర్పించిన వ్యక్తికి...

ఫ్రాక్చర్‌ అయిన తన భుజంపై నన్ను మోసుకువెళ్లిన దృఢమైన సారథికి.. నా ఫొటోషూట్లను మరింత ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి.. అన్నిటికంటే ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ నవ్వులతో ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే బాబా’’ అంటూ సారా క్యాప్షన్‌ జత చేయగా.. ఆమె పోస్ట్‌ వైరల్‌గా మారింది.

కాగా 1989లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన సచిన్‌ టెండుల్కర్‌ లిటిల్‌ మాస్టర్‌ నుంచి క్రికెట్‌ దేవుడిగా ఎదిగాడు. తన ఇరవై రెండేళ్ల కెరీర్‌లో లెక్కలు మిక్కిలి రికార్డులు సాధించిన మాస్టర్‌ బ్లాస్టర్‌.. తన కెరీర్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఏకైక టీ20 ఆడాడు.

సచిన్‌ కెరీర్‌లో  టాప్‌-9 రికార్డ్స్‌ ఇవే
👉టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌- 15,921
👉వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌- 18,426
👉అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్‌- 463
👉అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌- 200
👉వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ చేసిన క్రికెటర్‌
👉అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌
👉దేశవాళీ క్రికెట్‌లో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులిప్‌ ట్రోఫీ అరంగేట్రంలోనే శతక్కొట్టిన వీరుల జాబితాలో తొలి స్థానం
👉టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌- 51
👉వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌- 2278.

చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)