Breaking News

సామ్‌ కుర్రాన్‌ విధ్వంసం.. విండీస్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

Published on Fri, 11/15/2024 - 08:47

సెయింట్‌ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. 2019 తర్వాత కరేబియన్‌ గడ్డపై టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.

ఇక వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ తొలుత విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.

విండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ రావ్‌మన్‌ పావెల్‌(54) టాప్‌ స్కోరర్‌గా నిలవగా..షెఫర్డ్‌(30) రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సాకిబ్ మహమూద్, జెమ్మీ ఓవర్టన్‌ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 146 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కుర్రాన్‌(26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. లివింగ్‌ స్టోన్‌​(39), విల్‌ జాక్స్‌(32) పరుగులతో సత్తాచాటారు. విండీస్‌ స్పిన్నర్‌ 4 వికెట్లతో చెలరేగినప్పటకి తన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇక నాలుగో టీ20 ఇరు జట్ల మధ్య నవంబర్‌ 16న సెయింట్‌ లూసియా వేదికగా జరగనుంది.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌ బై!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)