Breaking News

కేరళ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌

Published on Mon, 12/25/2023 - 18:07

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్‌ ఆసోషియేషన్‌ ప్రకటించింది. మొదటి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఎంపికయ్యాడు. డైనమిక్ ఓపెనర్ రోహన్ కునుమ్మల్ సంజూకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ విష్ణు వినోద్‌, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సిజోమన్ జోసెఫ్‌కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు.

అదే విధంగా యువ వికెట్ కీపర్ విష్ణు రాజ్‌కు తొలిసారి కేరళ రంజీ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో శ్రేయాస్ గోపాల్, జలజ్ సక్సేనా వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. వచ్చే రంజీ సీజన్‌లో కేరళ తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ జనవరి 5 నుంచి అలప్పుజా వేదికగా  ప్రారంభం కానుంది.

ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సంజూ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 114 బంతుల్లో 6 ఫోర్ల, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను శాంసన్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

రంజీ ట్రోఫీకి కేరళ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్‌), రోహన్ కున్నుమ్మల్ (వైస్‌ కెప్టెన్‌), కృష్ణ ప్రసాద్, ఆనంద్ కృష్ణన్, రోహన్ ప్రేమ్, సచిన్ బేబీ, విష్ణు వినోద్, అక్షయ్ చంద్రన్, శ్రేయాస్ గోపాల్, జలజ్ సక్సేనా, వైశాక్ చంద్రన్, బాసిల్ థంపి, విశ్వేశ్వర్ ఎ సురేష్, ఎం డి నిధీష్, బాసిల్, విష్ణు రాజ్
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?