Breaking News

ఐపీఎల్‌ వేలంలో అతడు హాట్‌కేక్‌.. కెప్టెన్‌ చేసినా నో సర్‌ఫ్రైజ్‌

Published on Thu, 12/14/2023 - 13:37

ఐపీఎల్‌-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలం జరగనుంది. ఈ వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ కోసం పోటీపడే జట్లను భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీలు కమ్మిన్స్‌ కోసం పోటీ పడనున్నట్లు మంజ్రేకర్‌ జోస్యం చెప్పాడు.

కాగా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌-2023కు దూరంగా ఉన్న కమ్మిన్స్‌.. ఐపీఎల్‌-2024 వేలంలో మాత్రం తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కమ్మిన్స్‌పై కాసుల వర్షం కురిసే ఛాన్స్‌ ఉంది. 

"ప్యాట్‌ కమ్మిన్స్‌కు పిచ్‌ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేసే సత్తా ఉంది. అతడొక ఎక్స్‌ ఫ్యాక్టర్‌. ప్రస్తుతం కొన్ని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు మంచి నాయకులు కోసం వెతుకుతున్నాయి. వేలంలో అతడిని దక్కించుకోనుందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం​ ఉంది. ఎస్‌ఆర్‌హెచ్‌కు మార్‌క్రమ్‌, పంజాబ్‌ కింగ్స్‌కు ధావన్‌ కెప్టెన్‌లగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కెప్టెన్‌గా కమ్మిన్స్‌ ప్రదర్శన అద్భుతంగా ఉంది.

ఈ నేపథ్యంలో పంజాబ్‌, ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీలు తమ జట్టు పగ్గాలు అప్పగించిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని" స్టార్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్‌ పేర్కొన్నాడు . కాగా కమ్మిన్స్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ను కమ్మిన్స్‌ సారథ్యంలోని ఆసీస్‌ సొంతం చేసుకుంది. అదే విధంగా ఐపీఎల్‌లో కూడా కమ్మిన్స్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడిన కమ్మిన్స్‌ 379 పరుగులతో పాటు 45 వికెట్లు సాధించాడు.
చదవండి: అతడొక అద్భుతం.. పాక్‌ క్రికెట్‌లో లెజెండ్‌ అవుతాడు: గంభీర్‌

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)