Breaking News

జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌లకు దక్కని చోటు..!

Published on Mon, 08/26/2024 - 07:39

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ సంజయ్‌ బాంగర్‌ ప్రస్తుత తరంలో తన ఫేవరెట్‌ వరల్డ్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌లను ఎంపిక చేసిన బాంగర్‌.. వన్‌డౌన్‌లో కేన్‌ విలియమ్సన్‌, నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లి, వికెట్‌కీపర్‌గా రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్ల కోటాలో బెన్‌ స్టోక్స్‌, రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసర్లుగా జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ, జోష్‌ హజిల్‌వుడ్‌ను ఎంపిక చేశాడు. బాంగర్‌ తన వరల్డ్‌ ఫేవరెట్‌ జట్టులో వరల్డ్‌ టాప్‌ టెస్ట్‌ బ్యాటర్లు జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే, రావ్‌ పోడ్‌కాస్ట్‌తో బాంగర్‌ మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ ఓ దశలో తనతో టెస్ట్‌ డబుల్‌ సెంచరీల గురించి డిస్కస్‌ చేశాడని చెప్పాడు. అప్పటి వరకు విరాట్‌ టెస్ట్‌ల్లో ఒక్క డబుల్‌ సెంచరీ కూడా చేయలేదని అన్నాడు. అది అతని కెరీర్‌లో వెలితిగా ఉండేదని చెప్పాడు. అయితే విరాట్‌ డబుల్‌ సెంచరీలు ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత ఒకే సీజన్‌లో నాలుగైదు డబుల్‌ సెంచరీలు చేసి తానేంటో నిరూపించుకున్నాడని గుర్తు చేశాడు.

బ్యాటింగ్‌లో విరాట్‌ ఓ జీనియస్‌ అని కొనియాడాడు. అతను పట్టుపట్టాడంటే సాధించే వరకు వదలడని తెలిపాడు. విరాట్‌లా కష్టపడే వారు జట్టులో మరొకరు లేరని ప్రశంసించాడు. అతను జట్టు కోసం ఎంతో చేశాడని అన్నాడు. అతను దూకుడు మనిషే కానీ, అదే చాలా సందర్భాల్లో జట్టు విజయాలకు దోహదపడిందని గుర్తు చేశాడు. విరాట్‌ విదేశాల్లో రాణించేందుకు ఎక్కువగా ఇష్టపడతాడని తెలిపాడు. జట్టు సభ్యులు కూడా విదేశీ పిచ్‌లపై రాణించాలని విరాట్‌ కోరుకుంటాడని అన్నాడు.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)