More

IND Vs NZ: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే..

6 Dec, 2021 13:08 IST

Ravi Ashwin to break Muttiah Muralitharan Test record:  టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై బారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు.  శ్రీలంక గ్రేట్ ముత్తయ్య మురళీధరన్‌ను అధిగమించి టెస్ట్ క్రికెట్‌లో ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచే సత్తా అశ్విన్‌కు ఉందని అతడు తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్‌.. ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌ల వికెట్లకు దగ్గరగా ఉన్నడాని బంగర్ చెప్పాడు. ఇప్పటికే అశ్విన్‌ టెస్ట్‌ క్రికెట్‌లో 427 వికెట్లు పడగొట్టాడని, మురళీధరన్‌ను అధిగమించే అన్ని అవకాశాలు అశ్విన్‌కు ఉన్నాయని బంగర్ అభిప్రాయపడ్డాడు.

"అతను కొన్నాళ్లపాటు పాటు ఫిట్‌గా ఉంటే మురళీధరన్ రికార్డును అధిగమించగలడు. ఎందుకంటే అతని రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలిగితే అది రవిచంద్రన్ అశ్విన్ అని ముత్తయ్య మురళీధరన్ స్వయంగా చెప్పాడు" అని బంగర్ స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నాడు.

"అశ్విన్‌ టెస్ట్‌క్రికెట్‌లో లాంగ్ స్పెల్‌ బౌలింగ్ బౌలింగ్  చేస్తాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో ఆడుతున్నప్పుడు తన ఆఫ్ స్పిన్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. కాబట్టి  మురళీధరన్ రికార్డు బ్రేక్‌ చేయగలడని నేను భావిస్తున్నాను" అని బంగర్ తెలిపాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IND Vs NZ: ముంబై టెస్ట్‌లో రికార్డు సృష్టించిన భారత్‌.. 1-0 తేడాతో సిరీస్‌ కైవసం

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?

CWC 2023: న్యూజిలాండ్‌తో సెమీస్‌.. గిల్‌ హాఫ్‌ సెంచరీ

తొలి రౌండ్‌లోనే సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి చుక్కెదురు 

CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?

ఫుట్‌బాల్‌ను తాకిన క్రికెట్‌ ఫీవర్‌.. భారత్‌-కివీస్‌ సెమీస్‌ మ్యాచ్‌కు విశిష్ట అతిథులు