Breaking News

'షోయబ్‌తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు'

Published on Sun, 01/21/2024 - 12:34

పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు సానియా మీర్జాతో విడాకులపై వదంతులు ప్రచారం అవుతుండగానే.. నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చాడు. ఎప్పటినుంచో వినిపిస్తున్న రూమర్స్‌ను షోయబ్‌ నిజం చేశాడు.

సనా జావెద్‌ను వివాహమాడిన ఫోటోలను మాలికే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇరు దేశాల క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఇక ఈ విషయంపై సానియా కుటుంబం తాజాగా స్పందించింది. కొన్ని నెలల క్రితమే సానియా, షోయబ్‌ విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.

"సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె స్పందించక తప్పట్లేదు. షోయబ్,  ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్‌కు తన న్యూ జర్నీ కోసం ఆమె శుభాకాంక్షలు తెలిపింది. ఇక అనవసర చర్చలు ఆపేయండి.

ఆమె తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఆమెకు అండగా నిలవాలి. తన గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా  గౌరవించాలని" ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2010లో తన మొదటి భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో ఇజహాన్‌ పుట్టాడు.
చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)