Breaking News

భారత్‌తో టీ20 సిరీస్‌.. శ్రీలంక హెడ్‌ కోచ్‌గా సనత్ జయసూర్య

Published on Mon, 07/08/2024 - 11:26

శ్రీలంక పురుషుల క్రికెట్‌ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ (SLC)  సోమ‌వారం ప్ర‌క‌టించింది. కాగా టీ20 వ‌రల్డ్‌క‌ప్‌-2024లో శ్రీలంక దారుణ ఆట‌తీరుతో గ్రూపు స్టేజిలోనే నిష్క‌మ్రించింది. 

దీంతో అప్ప‌టివ‌ర‌కు లంక హెడ్‌కోచ్‌గా ప‌ని చేసిన క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్ర‌మంలో కొత్త హెడ్‌కోచ్‌ను భ‌ర్తీ చేసే ప‌నిలో శ్రీలంక క్రికెట్ బోర్డు ప‌డింది. అయితే కొత్త కోచ్ వ‌చ్చే అంత‌వ‌ర‌కు లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా జ‌య‌సూర్య ప‌నిచేయ‌నున్నాడు. 

కాగా జ‌య‌సూర్య ఇటీవ‌ల ముగిసిన పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక‌ కన్సల్టెంట్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు.  డిసెంబర్ 2023 నుండి శ్రీలంక క్రికెట్ కన్సల్టెంట్‌గా ప‌నిచేస్తున్నా డు.  ఇప్పుడు ప్ర‌మోష‌న్ పొంది హెడ్‌కోచ్‌గా సేవ‌లు అందించున్నాడు ఈ లెజండ‌రీ క్రికెట‌ర్‌. 

స్వ‌దేశంలో ఈ నెల 27 నంచి భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌తో లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా స‌న‌త్ జ‌య‌సూర్య ప్ర‌యాణం మొద‌లు కానుంది. లంక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త్ మూడు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్‌ల‌లో ఆతిథ్య జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. కాగా ఈ ప‌ర్య‌ట‌న‌తోనే భార‌త జ‌ట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: #Abhishek Sharma: చ‌రిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)