Breaking News

శ్రీలంక హెడ్‌కోచ్‌గా జయసూర్య.. మరో ఏడాది పాటు!

Published on Sun, 09/29/2024 - 13:10

శ్రీలంక హెడ్‌కోచ్‌గా దిగ్గ‌జ క్రికెట‌ర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు  పొడిగించింది. ఈ ఏడాది జూలైలో భార‌త్‌తో జ‌రిగిన ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జ‌య‌సూర్య బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

అయితే టీమిండియాతో టీ20 సిరీస్ కోల్పోయిన‌ప్ప‌ట‌కి వ‌న్డేల్లో మాత్రం లంక అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. వ‌న్డే సిరీస్‌ను 2-0 తేడాతో లంకేయులు కైవ‌సం చేసుకున్నారు. ఆ త‌ర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన శ్రీలంక టీమ్ అక్క‌డ కూడా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన‌ప్ప‌ట‌కి.. ఓవ‌ల్ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టెస్టులో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ప్ర‌స్తుతం త‌మ సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా శ్రీలంక అద‌ర‌గొడుతుంది. ఇప్ప‌టికే తొలి టెస్టులో కివీస్‌ను చిత్తు చేసిన లంక‌.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజ‌యానికి చేరువైంది. 

గ‌త మూడు నెల‌లగా జ‌య‌సూర్య నేతృత్వంలోని లంక జట్టు తమ పూర్వ వైభవంగా దిశగా అడుగులు వేస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. 

ఇప్పుడు కివీస్‌తో రెండో టెస్టులో విజయం సాధిస్తే శ్రీలంక స్ధానం మరింత మెరుగుపడే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా శ్రీలంక ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే జయసూర్య సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని లంక క్రికెట్‌ బోర్డు నిర్ణయించుకుంది.
చదవండి: IND vs BAN: 'అత‌డేం త‌ప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్‌

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)