Breaking News

సూపర్ కింగ్స్‌కు హార్ట్ బ్రేకింగ్‌.. ఒక్క పరుగు తేడాతో ఓటమి

Published on Sat, 07/05/2025 - 13:53

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌-2025లో శ‌నివారం శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిలబెట్టింది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠిభ‌రితంగా సాగిన ఈ పోరులో సూప‌ర్ కింగ్స్‌పై ఒక్క ప‌రుగు తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో విజ‌యం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శాన్‌ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగులు చేసింది. యూనికార్న్స్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (80: 63 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్బుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. అత‌డితో పాటు హసన్ ఖాన్ (40: 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. మిగితా బ్యాట‌ర్లు ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు. టెక్సాస్ బౌలర్లలో స్టోయినిష్ మూడు, మోసిన్, అకీల్, బర్గర్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

ఫెర్రీరా పోరాటం వృథా..
అనంతరం లక్ష్య ఛేదనలో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్‌లో సూపర్ కింగ్స్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను ఆసీస్ స్పీడ్ స్టార్ బార్ట్‌లెట్‌కు షార్ట్ అప్పగించాడు. బార్ట్‌లెట్ ఆ ఓవర్‌లో 11 పరుగులే ఇచ్చి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు.

చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన క్రమంలో కాల్విన్ (2) రనౌట్‌ కావడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.  సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డొనొవన్‌ ఫెర్రీరా( 39: 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.

అతడితో పాటు , సాయితేజ ముక్కామల (34), శుభమ్‌ రంజనె (28) తమవంతు ప్రయత్నం చేశారు. . శాన్‌ ఫ్రాన్సిస్కో బౌలర్లలో బ్రాడీ కౌచ్ , రొమారియో షెఫర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..హసన్ ఖాన్, కరీమా గోరె చెరో వికెట్ తీశారు.  ఇప్పటికే ఇరు జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్‌లను ఖారారు చేసుకున్నాయి.
చదవండి: వేలంలో రికార్డులు బ‌ద్ద‌లు.. అత్యంత ఖరీదైన ఆట‌గాడిగా సంజూ శాంస‌న్‌
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)