Breaking News

సామ్ కరన్ హ్యాట్రిక్‌.. శ్రీలంక‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం

Published on Sat, 01/31/2026 - 17:43

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు ముందు ఇంగ్లండ్ జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. శుక్ర‌వారం ప‌ల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 11 ప‌రుగుల తేడాతో(డ‌క్ వ‌ర్త్ లూయిస్‌) ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. తొలుత వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 17 ఓవ‌ర్లకు కుదించారు. ఈ క్ర‌మంలో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16.2 ఓవ‌ర్ల‌లో 133 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండిస్(37) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. పాతుమ్ నిస్సంక (23), ష‌న‌క‌(20) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. 16 ఓవ‌ర్ వేసిన క‌ర‌న్  దాసున్ షనక, మహీష్ తీక్షణ, మతీష పతిరాణ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు.

అత‌డితో పాటు అదిల్ ర‌షీద్ మూడు, డాస‌న్ రెండు, ఓవ‌ర్ట‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు.  అనంత‌రం ల‌క్ష్య చేధ‌నలో ఇంగ్లండ్ 15 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయితే 15 ఓవర్ల తర్వాత భారీ వర్షం పడటంతో ఆట సాధ్యం కాలేదు.

అప్పటికే డక్‌వర్త్ లూయిస్ పార్ స్కోర్ కంటే ఇంగ్లండ్ 11 పరుగులు ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (46) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. టామ్ బాంటన్ (29), బ‌ట్ల‌ర్‌(17) రాణించాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు సాధించాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)