Breaking News

క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేసిన సల్మాన్‌ ఖాన్‌

Published on Wed, 06/25/2025 - 17:43

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఓ క్రికెట్‌ టీమ్‌కు ఓనరయ్యాడు. ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL)ఎడిషన్‌తో అరంగేట్రం చేయనున్న న్యూఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ISPL కమీషనర్‌ సూరజ్‌ సమత్‌ ధృవీకరించాడు. ISPLలో సల్మాన్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు. ISPLలో సల్మాన్‌ భాగస్వామ్యం లీగ్‌ యొక్క కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నాడు.

ISPLలో ఇదివరకే పలువురు సినీ ప్రముఖులు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ (మాఝీ ముంబై), సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ (టైగర్స్ ఆఫ్ కోల్‌కతా), అక్షయ్ కుమార్ (శ్రీనగర్ కే వీర్), తమిళ నటుడు సూర్య (చెన్నై సింగమ్స్), హృతిక్ రోషన్ (బెంగళూరు స్ట్రైకర్స్), మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ (ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్) సంబంధిత ఫ్రాంచైజీలకు ఓనర్లుగా ఉన్నారు.

ISPLకు శక్తివంతమైన కోర్ కమిటీ ఉంది. ఇందులో భారతరత్న సచిన్ టెండూల్కర్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యుడు మరియు క్యాబినెట్ మంత్రి ఆశిష్ షెలార్, మినల్ అమోల్ కాలే, సూరజ్ సమత్‌ సభ్యులుగా ఉన్నారు.

ISPL అనేది టెన్నిస్‌ బాల్‌తో జరిగే టీ10 టోర్నమెంట్‌. ఈ టోర్నీని 2024లో ప్రారంభించారు. దేశం నలుమూలల్లో ఉండే క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడే అవకాశం​ కల్పించాలన్న ఆలోచనతో ఈ లీగ్‌ పుట్టింది. ఈ లీగ్‌ కోసం ఆటగాళ్లను ఐపీఎల్‌ వేలం తరహాలో ఎంపిక​ చేసుకుంటారు.

రెండు సీజన్లలోనే ఈ టోర్నీ విశేషమైన ప్రజాధరణ పొందింది. రానున్న సీజన్‌ కోసం ఇప్పటికే 42 లక్షల రిజిస్ట్రేషన్లు  దాఖలయ్యాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ ఓనర్‌గా సల్మాన్‌ చేరిక రిజిస్ట్రేషన్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. త్వరలోనే అహ్మదాబాద్‌కు సంబంధించిన ఫ్రాంచైజీపై కూడా ప్రకటన రావచ్చని తెలుస్తుంది.

ISPL మొదటి సీజన్‌లో టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కతా ఛాంపియన్‌గా అవతరించింది. గత సీజన్‌లో అమితాబ్ బచ్చన్ ఫ్రాంచైజీ మాఝీ ముంబై విజేతగా నిలిచింది. గత సీజన్‌ రికార్డు స్థాయిలో 28 మిలియన్లకు పైబడిన టీవీ వ్యూయర్షిప్‌ను పొందింది. అరంగేట్రం ఎడిషన్‌తో పోలిస్తే ఇది 47 శాతం అధికం.

ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన అనంతరం సల్మాన్‌ ఖాన్‌ ఇలా స్పందించాడు. ISPL  ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సాధికారత కల్పిస్తుంది. భారత దేశంలోని ప్రతి వీధిలో ప్రతిధ్వనించే హృదయ స్పందన క్రికెట్. ఆ శక్తి స్టేడియంకు చేరుకున్నప్పుడు ISPL వంటి లీగ్‌లు పుడతాయి. 

క్రికెట్‌ పట్ల నేను ఎప్పుడూ మక్కువ కలిగి ఉంటాను.  ఈ ప్రత్యేకమైన లీగ్ భారతదేశంలో అట్టడుగు స్థాయి క్రికెట్‌ను ప్రోత్సహించడమే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు విలువైన వేదికను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తుంది. కాబట్టి ISPLలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, ISPLలో విజేతకు రూ. కోటి, రన్నరప్‌కు రూ. 50 లక్షలు బహుమతిగా ఇస్తారు. 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)