Breaking News

పాక్‌ ఫీల్డర్‌ సంచలనం.. క్రికెట్‌ చరిత్రలో సూపర్‌ క్యాచ్‌! వీడియో వైరల్‌

Published on Wed, 02/12/2025 - 18:35

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా క‌రాచీ వేదిక‌గా మూడో మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఇప్ప‌టికే న్యూజిలాండ్ ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధించ‌గా.. మ‌రో స్ధానం కోసం ప్రోటీస్‌, పాక్ జట్లు పోటీ ప‌డుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఆట‌గాడు అఘా సల్మాన్ త‌న ఫీల్డింగ్ విన్యాసంతో ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జం జాంటీ రోడ్స్‌ను గుర్తు చేశాడు. స‌ల్మాన్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు.

అద్బుత‌మైన క్యాచ్‌తో ద‌క్షిణాఫ్రికా యువ సంచ‌ల‌నం  మాథ్యూ బ్రీట్జ్‌కేను స‌ల్మాన్ పెవిలియ‌న్‌కు పంపాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 39వ ఓవ‌ర్ వేసిన పాక్ స్పిన్న‌ర్ కుష్దిల్ షా.. తొలి బంతిని బ్రీట్జ్‌కేకి షా టాస్‌డ్‌అప్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని బ్రీట్జ్‌కే కాస్త ముందుకు వ‌చ్చి కవర్స్‌పై నుంచి ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు.

షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ అయినప్ప‌టికి క‌వ‌ర్స్‌లో ఉన్న ఆఘా సల్మాన్ అద్బుతం చేశాడు. సల్మాన్ తన కుడివైపునకు గాల్లోకి దూకుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఎన్నాళ్లకు పాక్ ఫీల్డర్ల నుంచి గుడ్ క్యాచ్ చూశాము నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బ్రీట్జ్‌కే సూపర్ ఇన్నింగ్స్‌..
కాగా ఈ మ్యాచ్‌లో కూడా బ్రీట్జ్‌కే దుమ్ములేపాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్‌ టెంబా బావుమా(82), క్లాసెన్‌(87) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది రెండు వికెట్లు సాధించగా.. నసీం షా, కుష్దిల్‌ షా తలా వికెట్‌ సాధించారు.
చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)