Breaking News

దేశవాళీ మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంపు

Published on Fri, 12/26/2025 - 04:01

న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీస్థాయిలో వేతనాలు పెంచింది. క్రికెటర్లతో పాటు మ్యాచ్‌ అఫీషియల్స్‌కు సైతం జీతభత్యాల్ని పెంచింది. ఇప్పుడు చెల్లిస్తున్న దానికి రెట్టింపును మించే విధంగా హెచ్చింపు చేసింది. ఈ మేరకు బోర్డు ఉన్నస్థాయి మండలి అమోదించడంతో  పెరిగిన వేతనాల్ని మహిళా క్రికెటర్లు, అఫీషియల్స్‌ ఈ సీజన్‌ నుంచే అందుకోనున్నారు. 

ఇప్పటివరకు దేశవాళీ టోర్నీలు ఆడే సీనియర్‌ మహిళా క్రికెటర్లకు రోజుకి రూ. 20 వేలు (రిజర్వ్‌ ప్లేయర్లకి రూ. 10 వేలు) చొప్పున చెల్లిస్తున్నారు. తాజా వేతన సవరణతో ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు అందనున్నాయి. అంటే తుది జట్టులో ఆడితే రూ. 50 వేలు, రిజర్వ్‌ బెంచ్‌లో ఉంటే రూ. 25 వేలు ఇస్తారు. 

జాతీయ టి20 టోర్నీల్లో పాల్గొనే అమ్మాయిలకు మ్యాచ్‌కు రూ. 25 వేల చొప్పున (రిజర్వ్‌ రూ. 12,500) చెల్లించనున్నారు. దీంతో  దేశవాళీ టోర్నీలకు సీజన్‌ ఆసాంతం అందుబాటులో ఉండే ఒక్కో సీనియర్‌  క్రికెటర్‌కు ఏడాదికి రూ. 12 లక్షల నుంచి 14 లక్షల చొప్పున వేతన భత్యాలు లభిస్తాయని బోర్డు అధికారులు వెల్లడించారు. 

జూనియర్లకు ఇలా... 
జూనియర్‌ మహిళా క్రికెటర్ల పంట కూడా పండింది. అండర్‌–23, అండర్‌–19 వయో విభాగాల టోర్నీలు ఆడే అమ్మాయిలు రోజుకి రూ. 25 వేలు (రిజర్వ్‌ రూ.12,500) చొప్పున పొందుతారు. దేశవాళీ మ్యాచ్‌లకు ఫీల్డ్‌ అంపైర్లు, రిఫరీలు, అఫీషియల్స్‌గా పనిచేసే వారికి రూ. 40 వేలు రోజుకు చెల్లిస్తారు. 

మ్యాచ్‌ ప్రాధాన్యతను బట్టి ఈ చెల్లింపు మొత్తం కూడా పెరగనుంది. అంటే నాకౌట్, సెమీఫైనల్స్, ఫైనల్‌ దశ మ్యాచ్‌ అధికారులకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తారు. దీనివల్ల రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు ఒక్కో అఫీషియల్‌కు రూ. 1 లక్షా 60 వేలు, నాకౌట్‌ దశలో అయితే రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు మ్యాచ్‌ ఫీజుగా అందనుంది.  

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)